ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
డైరెక్టర్ లు, హీరోయిన్ లు, హీరోలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.ఈ నేపథ్యంలోని తాజాగా కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు.విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు పీఎస్ మిత్రన్.

ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ తో కలిసి హీరో అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.ఇది కూడా విజయం సాధించింది.ఇక గతేడాది కార్తీతో కలిసి తెరకెక్కించిన సర్దార్ సంచలన విజయం సాధించింది.
దసరా కానుకగా విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ భారీ వసూళ్లను రాబట్టింది.ఇలా తమిళ్‌లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు పీఎస్ మిత్రన్.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు.జర్నలిస్టు ఆశామీరా అయ్యప్పన్ ని తాజాగా పెళ్లి చేసుకున్నాడు.
అయితే గత ఏడాది జూన్ లో నిశ్చాతార్థం చేసుకున్న ఈ జంట.తాజాగా తంజావూర్ వేదికగా పెళ్లిపీటలెక్కారు.

ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో మిత్రన్ ఆశాల పెళ్లి ఘనంగా జరిగింది.ఈ జంట పెళ్లికి పలువు సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.ప్రస్తుతం ఈ నూతన వధువు వరులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అలాగే పెళ్లికి హాజరుకాని పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







