మహిళా ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది.ఈ మెగా ఈవెంట్ కోసం ముంబైలో బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
కాగా డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పాల్గొన్నాయి.
వేలం ప్రక్రియలో భాగంగా స్మృతి మందానాను రూ.3.4 కోట్లకు, ఈ.ఫెర్రీని రూ.1.7 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.8 కోట్లకు ముంబై దక్కించుకుంది.ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గార్డ్నర్ ను రూ.3.20 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
కాగా, ఈ వేలం కోసం 409 ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
లిస్టులో 246 మంది భారత మహిళా క్రికెటర్లుండగా 163 మంది విదేశీ మహిళా క్రికెటర్లు ఉన్నారు.







