క్రేజీ బజ్ : మూడు గెటప్ లలో బాలయ్య.. ఏ సినిమాలో అంటే?

బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Anil Ravipudi To Show A New Side Of Balakrishna Details, Balakrishna, Anil Ravip-TeluguStop.com

దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ఇక త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది.ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది.వీరిద్దరి మధ్య కథ ఎమోషనల్ గా సాగబోతోంది.

ఈ సినిమాలో బాలయ్యను అనిల్ ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే బాలయ్య రోల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Balakrishnaanil, Nbk, Sreeleela-Movie

బాలయ్య కోసం అనిల్ రావిపూడి భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ ను రాసినట్లు ఇప్పటికే హింట్ ఇచ్చాడు.ఇక ఇప్పుడు బాలయ్య గెటప్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు వస్తున్నాయి.బాలయ్య మొత్తంగా మూడు గెటప్స్ లో కనిపించ బోతున్నాడు అని బాలయ్య పాత్ర ఒక్కటే అయినా మూడు స్టేజ్ లలో మూడు లుక్స్ లలో బాలయ్య కనిపిస్తాడట.

Telugu Anil Ravipudi, Balakrishna, Balakrishnaanil, Nbk, Sreeleela-Movie

ఒక ముప్పై ఏళ్ల యువకుడి గెటప్ లో మరొకరి ఏభై ఏళ్ల వ్యక్తిగా అలాగే డెబ్భై ఏళ్ల పెద్దాయనగా కూడా బాలయ్య రోల్ ఉండబోతుంది అని తెలుస్తుంది.ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరో జీవితం మారుతుందని బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.మొత్తానికి అనిల్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube