టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇందులో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోగా, రష్మిక మందన పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక హీరోయిన్ రష్మిక మందన విషయానికి వస్తే.

సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా శ్రీవల్లి అనే పాత్రలో నటించి నటనతో ప్రేక్షకులను మెప్పించింది.ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమాతో బీభత్సమైన పాపులారిటీ రావడంతో రష్మిక మందన సౌత్ సినిమాలు తగ్గించి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా పార్ట్ 2 ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమాకు సంబంధించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే పుష్ప పార్ట్ 2 లో రష్మిక మందన పాత్ర నిడివిని తగ్గించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.పార్ట్ 2 లో రష్మిక కేవలం కొన్ని సన్నివేశాలలో కనిపిస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక అభిమానులు మండిపడుతున్నారు.కొందరు అయితే కంగారు పడుతున్నారు. రష్మిక మందన స్క్రీన్ పై కొద్దిసేపు కనిపిస్తే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ వార్తల్లో నిజా నిజాలు ఎంత అన్నది ఇంకా తెలియలేదు.
కాగా ఈ సినిమాలో రష్మిక మందన పాత్ర నిడివి తక్కువ అన్న వార్తలపై ఇప్పటివరకు రష్మిక కానీ అటు మూవీ మేకర్స్ కానీ స్పందించలేదు.







