కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టాలని ప్రభుత్వం కోరింది.
ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి తెలపకుండా సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేశారు.
ఈ క్రమంలో డివిజన్ బెంచ్ లో పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ బాధిత రైతులు నిరసనలు చేసిన విషయం తెలిసిందే.







