ఏవైనా తుంటరి పనులు చేస్తే కోతి పనులు చేయొద్దని చిన్న పిల్లలను పెద్ద వాళ్లు తిడుతుంటుంటారు.అయితే కోతి పనులు అనడానికి చాలా నేపథ్యం ఉంది.
ముఖ్యంగా కోతులు చేసే అల్లరి చాలా చిరాకు రప్పిస్తుంది.తమకు నచ్చిన వాటిని ఎత్తుకుపోతుంటాయి.
తినుబండారాలతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ పోయేవారి చేతిలో విలువైన వస్తువులను లాక్కెళ్లి పోతుంటాయి.వాటిని ఏమీ చేయలేక చాలా మంది నిస్సహాయంగా ఉండిపోతారు.
కోతి చేష్టలు ఇలాగే ఉంటాయనని, ఏమీ చేయలేమని సరిపెట్టుకుంటుంటారు.అయితే కోతులు మంచి పనులు చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
ముఖ్యంగా కోతులను ఆడించే వారు వాటిని చాలా బాగా కట్టడి చేస్తుంటారు.ఇదే కోవలో కోతిని దాని యజమాని బాగా కట్టడి చేస్తున్నాడు.
చెప్పిన పని చేసేలా దానికి ట్రైనింగ్ ఇచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాని గురించి తెలుసుకుందాం.

అల్లరి పనులు చేసే వారు ఉన్నపళంగా మంచి పనులు చేస్తే అంతా ఆశ్చర్యపోతుంటారు. అల్లరి తనానికి, తుంటరి తనానికి మారు పేరైన కోతులు మంచి పనులు చేస్తుంటే కూడా విచిత్రంగా ఉంటుంది.ఇదే కోవలో ఓ కోతి ఇంట్లోని ఎంగిలి గిన్నెలన్నీ తోముతోంది.
అది ఏదో తుంటరి పని చేయగా, దానికి పనిష్‌మెంట్గా ఆ పనిని యజమాని అప్పగించాడు.దీంతో తనకు కష్టమైనప్పటికీ ఆ బాసిన్లు అన్నీ ఆ కోతి చకచకా తోమేస్తుంది.
యజమాని ఆదేశాన్ని నోరు మూసుకుని అది పాటించింది.యజమాని దగ్గరుండి దానికి ఆదేశాలిచ్చాడు.
ఆ కోతి కూడా ఆ ఆదేశాలను పాటిస్తూ గిన్నెలు చక్కగా తోమేసింది.ఈ వీడియోను ____arun____520 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
ఆ కోతి చేసే పనులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.పాపం దానికి ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ కామెంట్లు పెడుతున్నారు.








