రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాలలో ఒకటి.దిల్ రాజు మొదట సోలోగా ఈ సినిమాను నిర్మించాలని భావించగా ఆ తర్వాత జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించారు.
నిన్న కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఆర్సీ15 మూవీ షూట్ జరిగింది.కర్నూలులో ఓపెన్ ప్లేస్ లో షూట్ జరగడంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ సినిమాలో శ్రీకాంత్ పార్టీ పేరు అభ్యుదయం కాగా పార్టీ అధినేతగా కనిపిస్తారని తెలుస్తోంది.షూట్ చూడటానికి వచ్చిన అభిమానులనే న్యాచురల్ క్రౌడ్ గా షూట్ చేశారు.
శ్రీకాంత్ రామ్ చరణ్ కౌగిలించుకున్న సన్నివేశాలను తాజాగా షూట్ చేశారని సమాచారం.చరణ్ లుక్ లీక్ కాగా ఆ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఏ సినిమాను షూట్ చేసినా ఆ సినిమా హిట్ అని సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో కామెంట్లు వినిపిస్తుంటాయి.ఆ సెంటిమెంట్ ప్రకారం చరణ్ శంకర్ కాంబో మూవీ కూడా హిట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్ కు జోడీలుగా అంజలి, కియారా నటిస్తుండగా చరణ్ అంజలి మధ్య ఏజ్ గ్యాప్ చాలా తక్కువ కావడం గమనార్హం.

చరణ్ శంకర్ కాంబో మూవీ రికార్డులు తిరగరాసే మూవీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.చరణ్ శంకర్ కాంబో మూవీలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు కొదువ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ ఆచార్య మూవీ మిగిల్చిన చేదు జ్ఞాపకాన్ని ఈ సినిమాతో కచ్చితంగా చెరిపేస్తానని నమ్మకంతో ఉన్నారని సమాచారం.
చరణ్ స్థాయిని పెంచే మూవీ ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.







