చాలామంది ప్రజలు పబ్లిక్ టాయిలెట్లలో మూత్ర విసర్జన చేయడం, బహిరంగ ప్రదేశాలలో వాష్ రూమ్ నీ ఉపయోగించడం లేదు.బహిరంగ ప్రదేశాల్లో ముత్ర విసర్జన చేయడం తప్పే కానీ పబ్లిక్ టాయిలెట్లను వాడుకుంటే సరిపోతుంది.
మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి.
పరిశుభ్రత అంటూ బయట వెళ్లకుండా ముత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారు.ఇంటికి వెళ్లిన తర్వాత బాత్రూం కి వెళ్లాలని అనుకుంటారు.సరే కొన్ని సమయాల్లో ముత్రాన్ని ఆపుకుంటారు.కానీ మీరు దీన్ని అతిగా చేస్తే మీకు మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సాగడం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉంటుంది.ముత్రాన్ని ఆపుకోవడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడుతుంది.అంతేకాకుండా మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా అవకాశాలు కూడా పెరుగుతాయి.ఇది మూత్ర నాళలలో ఇన్ఫెక్షన్ కి వచ్చే అవకాశం ఉంది.అప్పుడప్పుడు మూత్రంలో రక్తం కనిపించడం, విసర్జన సమయంలో మంటగా అనిపించడం, నిరంతరం మూత్ర విసర్జన చేయవలసి రావడం, రంగు మారిన,మూత్రంలో దుర్వాసన, మూత్ర విసర్జన సమయంలో పొత్తి కడుపు ప్రాంతంలో నొప్పి రావచ్చు.
తక్కువ నీరు తాగే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి ముత్రాన్ని ఆపుకొవడం వల్ల ఏం కాదు.కానీ క్రమం తప్పకుండా అలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అంతే కాకుండా మూత్రపిండాల సమస్యలు ఉండేవారిలో ఇది ఎంతో ప్రమాదకరం.గర్భిణీ స్త్రీలు మూత్రం ఆపుకోవడం మాత్రం అస్సలు చేయకూడదు.