తమిళ్ హీరోల్లో చాలా మందికి ఇక్కడ కూడా మార్కెట్ ఉంది.అక్కడి స్టార్ హీరోలు ఇక్కడ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి టాక్ వస్తే బాగానే కలెక్షన్స్ సాధిస్తాయి.
ఇలాంటి డబ్ చేసిన సినిమాలు మన టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇక తమిళ్ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు.
ఈయనకు తెలుగులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
సూర్య అంటే ముఖ్యంగా అమ్మాయిలకు బాగా క్రష్.
గజినీ సినిమా వచ్చిన సమయం నుండి సూర్య మన తెలుగులో మంచి మార్కెట్ సంపాదించు కున్నాడు.ఈ సినిమా తర్వాత సూర్య నటించే ప్రతీ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుండడంతో హిట్స్ అందుకోవడం జరుగుతూనే ఉంది.
ఇక ఇదిలా ఉండగా ప్రెజెంట్ సూర్య తన 42వ సినిమా చేస్తుంది.

డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.25 నుండి ఏళ్ల మధ్యలో మంచి బాడీ కలిసి ఉన్నవారు ఇంకా మంచి గడ్డం కలిగి ఉన్నవారు ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

ఒక మెయిల్ కూడా ఇచ్చి ఫోటోలను పంపాలని తెలిపారు.సూర్య అభిమానుల్లో అలాంటి వారు ఉంటే ఈ సినిమాలో అవకాశం పొందవచ్చు.మరి ఈ లక్షణాలు మీకు కూడా ఉంటే మీరు అవకాశం పొందే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇక గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







