ఇప్పుడు సినిమా స్థాయి వేరు, గతంలో సినిమా స్థాయి వేరు.పాన్ ఇండియా అంటే కూడా విలువ లేని రోజులు ఇవి.పాన్ వరల్డ్ పేరు చెప్తే తప్ప కథలు వినడం లేదు హీరోలు.ఒక సినిమా వస్తుంది అంటే దాని వెనుక ఎంతో టెక్నాలజీ ఉండి ఉంటుంది.హై టెక్నికల్ వాల్యూస్, హై రిజల్యూషన్ కెమెరాలు అబ్బో అది మామూలు హడావిడి కాదు.100 కోట్ల బడ్జెట్ ఉంది తీరాల్సిందే అలా అయితేనే అది వరల్డ్ రేంజ్ వండర్ అవుతుంది.ఒక సినిమా తీస్తున్నారు అంటే అందులో రెమ్యూనరేషన్ కి ఎంత పోతుంది, అలాగే సినిమా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రమోషన్స్ కోసం ఎంత వాటా తీస్తున్నారు అనేవి లెక్కలు వేరుగా చేయలి.ఎమోషన్ సమయంలో స్టేజ్ పైన చేసే హడావిడి మామూలుగా ఉండదు.
ఒకరినొకరు పొగుడుకోవాలి లేదంటే కన్నీళ్లు పెట్టిచ్చి ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేయాలి.అన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తూ వెళ్ళాలి.
సినిమా అంటే ఇన్ని ఆర్భాటాలు ఉండాలా అనే విధంగా నేటి సినిమా పరిస్థితి మారింది.కథలో ప్రాణం ఉండాలి, కథనంలో ఎంతో జీవం ఉండాలి, పాత్రల పరిధి కూడా చూసుకోవాలి, నటనా కౌశల్యం తప్పకుండా ఉండి ఉండాలి, వ్యాపార విలువలను పాటించాలి.ఇవన్నీ లేకుండా సినిమా సక్సెస్ కోసం వందల కోట్ల ఖర్చు పెట్టాల్సి రావడం నిజంగా బాధాకరం.ఇంత చేసాక అవార్డులు అనేవి ప్రతి విషయానికి ఒక కొలమానంగా మారిపోయాయి.
ఒక వ్యక్తి యొక్క ప్రతిభను కొలచడానికి ఆస్కార్ మాత్రమే కొలమానం అనే విధంగా నడుస్తోంది.
ఆస్కార్ దరి చేరని ఎంతో మంది ఆణిముత్యాలు నాటి రోజుల్లో అలా మిగిలిపోయారు.ఇప్పుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఎంతో ఆరాటపడ్డాడు.గతంలో భారతి రాజా, సత్య జిత్ రే, శ్యామ్ బెనెగల్, మణిరత్నం, బాలచందర్, సింగీతం శ్రీనివాసరావు, విశ్వ నాథ్ వంటి వారు ఆస్కార్ కి సరిపోరా అనే అనుమానం వస్తుంది.
ఇక హీరోల విషయంలో ఎన్టీఆర్, అక్కినేని, ఎంజిఆర్, శివాజీ గణేషన్, రాజకపూర్, దిలీప్ కపూర్, మమ్ముట్టి, గిరీష్ కర్నాడ్ వంటి ఎంతో మంది హేమాహేమీలు ఉన్నారు.రజనీకాంత్, అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్ వీరందరూ ఏ అవార్డులకు సరితూగరా ? కమల్ హాసన్ లాంటి నటుడికి ఎన్ని అవార్డులు ఇవ్వాలో చెప్పండి.వారితో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతటి వారు.ఇక సినిమాల విషయానికొస్తే దానవీరశూరకర్ణ ఒక దృశ్య కావ్యం.
ఒక మల్లీశ్వరి, పాతాళ భైరవి, మాయాబజార్ వంటి సినిమాలకు ఆస్కార్ అర్హత లేదా ? బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి వంటి బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తులు మళ్లీ దొరుకుతారా ? ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో ఐదేళ్లు చెక్కితే ఆస్కార్ ఇస్తారు.కానీ నాటి రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా 50 రోజుల్లోనే తీసేవారు.