'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్ లాక్.. సమ్మర్ రేస్ కు సిద్ధం అవుతున్న సామ్!

సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.సమంత మెయిన్ లీడ్ లో నటించిన యశోద సినిమా తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Shaakuntalam Movie Release New Date Fix, Shaakuntalam Movie, Shaakuntalam Releas-TeluguStop.com

లేడీ ఓరియెంటెడ్ సినిమా సమంత సింగిల్ గా మేనేజ్ చెయ్యడంతో ఈమెతో నిర్మాతలు మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ఇక సమంత నుండి రాబోతున్న మరో లేటెస్ట్ సినిమా ”శాకుంతలం”.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.

అందుకే ఈ సినిమాను గ్రాండ్ గా చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఈ సినిమాను ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని ఎప్పుడో ప్రకటించి ఈ మేరకు ప్రమోషన్స్ కూడా చేసారు.

Telugu Gunasekhar, Samantha, Shaakuntalam-Movie

కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.మరి ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసారు.ఈ సినిమా ఈసారి సమ్మర్ బరిలో నిలవనుంది.ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

Telugu Gunasekhar, Samantha, Shaakuntalam-Movie

ఈ సినిమాలో సమంత అద్భుతమైన రోల్ లో నటించగా.మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు.అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.

అల్లు అర్హ దాదాపు 6 నిముషాల పాటు ఈ సినిమాలో కనిపించనుండి.కాగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చూడాలి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube