సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఫుల్ లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటారు.అయితే కొంతమంది నటీనటులు సినిమాలలో, యాడ్స్ లో నటిస్తూ ఫుల్ లగ్జరీ లైఫ్ ను గడిపితే ఇంకొంతమంది మాత్రం సినిమాలలో నటించకపోయినప్పటికీ కూడా లగ్జరీగా గడుపుతూ ఉంటారు.
అటువంటి వారిలో రేఖ కూడా ఒకరు.తెలుగు ప్రేక్షకులకు అలాగే యావత్ భారత్ సినీ ప్రేక్షకులకు రేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించిన రేఖ తనదైన శైలిలో నటిస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది.అంతే కాకుండా 80-90 కాలంలో అయితే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది రేఖ.అప్పట్లో విడుదలయ్యే సినిమాలలో రేఖ హీరోయిన్ అంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న విధంగా ఆమె తనదైన ముద్రను వేసుకుంది.జెమిని గణేషణ్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రేఖ అద్భుత నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.సినిమా ఇండస్ట్రీలో హీరోలైన హీరోయిన్లైనా ఒక సమయం వచ్చిన తర్వాత ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.
అలాగే వయసు మీద పడే కొద్దీ సినిమాలకు దూరం అవుతూ ఉంటారు.కాగా రేఖ చివరగా షమితాబ్ నటించింది.
ఇక అప్పటి నుంచి రేఖ ఇటువంటి సినిమాలలో కానీ యాడ్స్ లో కానీ నటించలేదు.కానీ ఇప్పటికీ ఆమె లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుండటం బాలీవుడ్ ని వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.రేఖ ఇలా లగ్జరీ లైఫ్ లో జీవించడానికి ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో వినిపిస్తున్న ప్రశ్న.రేఖ జెమిని గణేషన్ కుతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
రేఖ అప్పట్లోనే ఖరీదైన ప్రాంతాలలో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది.ఆ ప్రాపర్టీస్ నుంచి నెలవారిగా ఎంతో కొంత డబ్బు వస్తుండటం, రాజ్యసభ సభ్యురాలిగా పెన్షన్ కూడా ఆమె ఖాతాలో పడుతోంది.
దాంతో తన లైఫ్ ను ఇప్పటికీ లగ్జరీగా లీడ్ చేసుకుంటూ వస్తోంది లెజండరీ క్వీన్ రేఖ.