మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కపుల్.వీరు కలిసి సినిమాల్లో నటించడమే కాకుండా జీవితాన్ని కూడా పంచుకుని భార్యాభర్తలుగా మారిపోయారు.వంశీ సినిమా సమయంలో వీరి మధ్య లవ్ మొదలయ్యింది.ఆ లవ్ కాస్త పెళ్ళికి కూడా దారి తీసింది.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అన్యోన్య దంపతులుగా కలిసి మెలిసి ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో ముందుకు వెళుతున్నారు.ఈ జంట భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా కూడా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.
మరి ఈ అందమైన జంట ఈ రోజు తమ పెళ్లిరోజు జరుపు కుంటున్నారు.మహేష్ బాబు, నమ్రత జంట ఈ రోజు తమ 18వ పెళ్లి రోజు జరుపు కుంటున్నారు.

ఈ సందర్భంగా ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తమ వెడ్డింగ్ డే విషెష్ చెప్పుకున్నారు.మహేష్, నమ్రత ఇద్దరు కూడా తమ యంగ్ ఏజ్ నాటి బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేసుకుని ఒకరి మీద మరొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు.ఈ పిక్స్ చూసిన అభిమానులు బ్యూటిఫుల్ కపుల్ అంటూ తమ కామెంట్స్ చేస్తూ వారికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రెజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.