ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న అంబటి రాంబాబు ఇటీవల కేంద్ర బృందాలు ప్రాజెక్టులో పర్యటించి డయాప్రమ్ వాల్ నాణ్యత ప్రమాణాల పరిశీలనపై అధికారులు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న లోయర్ కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ , జట్ గ్రౌటింగ్, గైడ్ బండ్ పనుల ఆయన పరిశీస్తున్నారు ప్రాజెక్టు నిర్మాణ పరిశీలనలో భాగంగా తొలత ఎగువ, దిగువ కాపర్ డ్యాం,డయా ఫ్రమ్ వాల్ ,జెట్ గ్రౌటింగ్, గైడ్బండ్ ,పనులను పరిశీలించాం ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపాంగత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణం.డయాఫ్రంవాల్ నిర్మాణ విషయంలో నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ అధికారుల, నిపుణుల పరీక్షల నివేదికల తెలిసే వరకూ పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు జాప్యం జరుగుతుందో తెలియదు.
నిర్మాణం పనులు సావధానంగా చేస్తాం… గత ప్రభుత్వంలా తొందరపాటు చర్యలు తీసుకోం… మేము అధికారంలో ఉండగానే పూర్తి చేస్తాము.అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోముఆర్అండ్ఆర్ పరిహారాల విషయంలో నిర్వాసితులకు18 వందల పునరావాస కాలనీలు మా ప్రభుత్వ పాలనలోనే నిర్మించాము.41.17 కాంటూరు పరిధిలో నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారాలు అందిస్తాం.
ఇప్పటికే 3 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాము రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము…పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏం పనులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నిదులిస్తేనే సాధ్యం.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వాస్తవానికి కేంద్రమే చేయాలి టిడిపి ప్రభుత్వం కావాలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తామే చేస్తామని ప్రాజెక్టు ని ఈ స్థాయికి తీసుకువచ్చారు.
తుంగభద్రనదిపై కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వైసిపి ప్రభుత్వం పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తుంది.