నెల్లూరు: రూరల్ మండల సర్పంచ్ లతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం.వైసీపీని విబేధించాక తన వెనుక ఉన్న సర్పంచ్ లని మీడియాకి పరిచయం చేసిన ఎమ్మెల్యే.
నిన్న 11 మంది కార్పొరేటర్లతో సమావేశం.ఇవాళ సర్పంచులతో సమావేశం, ఆసక్తి రేపుతున్న రూరల్ రాజకీయం.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్… అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం నాకు ఇష్టం లేదు.అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డా.
నాకు అండగా నిలిస్తే కష్టాలు తెచ్చుకున్నట్లే… అయినా కూడా నా వెంట అనేక మంది నిలుస్తున్నారు.బెదిరింపులు, కష్టాలు ఎదుర్కొని నా వెనుక నిలిచిన వారికి కృతజ్ఞతలు.
సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పి కో ఆప్షన్ సభ్యులు అండగా నిలిచారు.
సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తా.టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేపించి న తర్వాత నా రాజీనామా అడగండి.దీన్ని స్పీకర్ ఆమోదించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్దమని ఎలక్షన్ కమిషన్ కి పంపండి… అప్పుడు స్పందిస్తాను.
భవిష్యత్ లో ఎలాంటి సమీక్షా సమావేశాలు పెట్టినా మమ్మల్ని పిలిచినా పిలవకున్నా నేను, మేయర్ సమావేశానికి వెళ్తాను.ఇరుకళల అమ్మవారి జాతర చేస్తాను… అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తాను.
ఇందులో రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాను.టీడీపీ నుంచి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష, నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు.
నిరంతరం ప్రజలకి దగ్గరగా ఉండేదాని కోసం నిత్యం కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను.