టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక ఈయన భార్య నమ్రత గురించి అందరికీ పరిచయమే.ఈమె కూడా ఇండస్ట్రీకి చెందిన నటి.తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.
ఇక మహేష్ బాబు నమ్రత కలిసి ఓ సినిమాలో కూడా నటించగా ఆ సమయంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.
దీంతో 2005లో పెళ్లి చేసుకోగా వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే పిల్లలు ఉన్నారు.ఇక నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.
నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది.
మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీ పట్ల బాగా కేర్ తీసుకుంటాడు.ఒకవైపు సినిమాలే కాకుండా మరోవైపు ఫ్యామిలీ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.సినిమా సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో బాగా టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

ముఖ్యంగా మహేష్ గారాల కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో బాగా ఎనర్జీ గా కనిపిస్తుంది.తల్లి తండ్రి కంటే ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.పూర్తి ఇండస్ట్రీ పరిచయం కూడా కానీ సితార తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.ఇక నమ్రత ఒకప్పుడు అంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా.
ఇప్పుడు ఆమెలో మాత్రం అటువంటి ప్రౌడ్ కనిపించదు.

ఒక తల్లిగా, ఒక భార్యగా, ఇల్లాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమెను చూసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇప్పుడు పెళ్లయిన హీరోయిన్లు కూడా గ్లామర్ షో చేస్తున్నారు కానీ.నమ్రత మాత్రం ఎప్పుడూ కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.
ఇప్పటికీ అంతే అందంగా ఉన్న ఈమె.అంతే అనువుగా ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
ఈరోజు తమ పెళ్ళి రోజు సందర్భంగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.
అందులో బెడ్ పై మహేష్ బాబు మీద పడుకొని ఆయనకు ముద్దు పెట్టినట్లు కనిపించింది.అయితే ఆ ఫోటో ఎప్పటిదో కాగా.ఈరోజు తమ 18వ పెళ్లిరోజు సందర్భంగా ఆ ఫోటో షేర్ చేస్తూ మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపింది.ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవ్వగా మహేష్ బాబు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బాగా లైక్స్ కొడుతున్నారు.







