వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.నిత్యం ఏదో ఒక వివాదంతో ఆయన మీడియా, సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తూ ఉంటారు.
కేవలం సినిమా అంశాల పైనే కాకుండా, రాజకీయ అంశాల పైన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు.వైసిపి సానుభూతిపరుడుగా ముద్ర వేయించుకున్న వర్మ నిరంతరం టిడిపి పైన, ఆ పార్టీలోని కీలక నాయకులపైన వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సెటైర్లు వేస్తూ ఉంటారు.
అదేవిధంగా ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర పైన వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

లోకేష్ యువ గళం పాదయాత్ర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వస్తున్నాయి.లోకేష్ పాదయాత్ర చేయలేక ఇబ్బందులు పడుతుండడం, ఆయన ప్రసంగాల్లో తప్పులు దొర్లుతుండడం, పాదయాత్రకు జనాలు అంతగా హాజరు కాకపోవడం వీటన్నిటిని హైలెట్ చేస్తూ వర్మ ట్విట్స్ చేస్తున్నారు.అంతేకాదు జనాలు లేక లోకేష్ పాదయాత్రను ముగించే ఆలోచనలో ఉన్నారనే అర్థం వచ్చే విధంగా ఆ యాత్రను నిలుపుదల చేసేందుకు వర్మ కొన్ని ఐడియాలను ఇస్తున్నారు.” పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్ ఒక టెర్రిఫిక్ ఐడియా చేయొచ్చు. జస్ట్ నొప్పో, లిగమెంట్ తెగిందనో చెప్పి , డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని , పాదయాత్ర ఆపేస్తే తెలుగుదేశం, చంద్రబాబు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది నా ఉచిత చచ్చు సలహా ! ” అంటూ వర్మ చేశారు.

ఇక అంతకుముందు మరో ట్వీట్ లో లోకేష్ పాదయాత్రకు జన సమీకరణ విషయంపై టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు మరో నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం పైన వర్మ ట్వీట్ చేశారు.” ఈ ఆడియో లీక్ చేసింది 100% అచ్చెం నాయుడు అని నాకు 1000% నమ్మకం.ఎందుకంటే నారా లోకేష్ అసలు కెపాసిటీ ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకునేలా చేసి తెలుగుదేశం పార్టీని కాపాడాలని పన్నిన అచ్చెం నాయుడు వ్యూహం ఇది ” అంటూ వర్మ ట్రీట్ చేశారు.






