ChatGPT రైవెల్‌ పో చాట్‌బాట్‌ను లాంచ్‌ చేసిన Quora ఎలా పని చేయబోతుందో తెలుసా?

Quora గురించి చదివే వుంటారు.Quora అనేది నాలెడ్జ్‌ షేర్‌ చేసుకునేందుకు రూపొందించిన ఓ ప్రత్యమైనటువంటి ప్లాట్‌ఫారం అని చెప్పుకోవచ్చు.

 Chatgpt రైవెల్‌ పో చాట్‌బాట్‌ను లా-TeluguStop.com

ఇక్కడ మీ మనస్సులో మెదులుతున్న అనేకరకాల ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు.అంతేకాకుండా వివిధ అంశాల్లో నిష్ణాతులైనవారిని ఇట్టే కనెక్ట్‌ కావచ్చు.

అయితే ప్రస్తుతం Quora కంపెనీ AI చాట్‌బాట్ స్పేస్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నట్లు CEO ఆడమ్ డి ఏంజెలో తాజాగా ప్రకటించడం విశేషం.AIతో సంభాషించడానికి యూజర్లకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

Telugu Chatbot, Chatgpt, Launches, Quora, Rival Poe, Sundar Pichai, Ups-Latest N

Quora CEO ఆడమ్ D ఏంజెలో ఓ ట్వీట్‌ చేస్తూ iOS వినియోగదారులు సదరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అంతేకాకుండా ఇన్‌స్టంట్‌గా ప్రశ్నలు కూడా అడగవచ్చని చెప్పారు.అలాగే త్వరలో అన్ని ప్రధాన ప్లాట్‌ఫారంలకు సపోర్ట్‌ అందజేస్తామని వివరించారు.అతని ట్వీట్‌ల ప్రకారం చూస్తే, పో ప్రధాన లక్ష్యం బాట్ అగ్రిగేటర్‌గా మారడం.ఒకే యాప్ నుంచి విభిన్న టాస్క్‌ల కోసం ఆప్టిమైజ్ చేసిన చాట్‌బాట్‌లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు సహాయం చేస్తుందన్నమాట.

రాబేయే నెలల్లో మరిన్ని బాట్‌లను యాడ్‌ చేయడంతోపాటు, ప్రధాన ప్లాట్‌ఫారంలకు సపోర్ట్‌ యాడ్‌ చేయనున్నట్లు Quora CEO చెప్పారు.

Telugu Chatbot, Chatgpt, Launches, Quora, Rival Poe, Sundar Pichai, Ups-Latest N

ఇకపోతే గూగుల్ కూడా త్వరలో ChatGPT ప్రత్యర్థి బార్డ్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమయ్యిందనే విషయం విదితమే.గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌కు AI ఫీచర్లను జోడించాలనే యోచనలో ఉన్నట్లు తాజాగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు.నాలుగో త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన సందర్భంగా సుందర్‌ పిచాయ్‌ ఈ వివరాలు వెల్లడించారు.

గూగుల్‌ కంపెనీ సొంత లాంగ్వేజ్‌ మోడల్‌ అయిన లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్స్‌ గూగుల్‌ సెర్చ్‌ను ప్రభావితం చేస్తుంది.ఇది వాస్తవ, సంభాషణ క్వెరీ రిజల్ట్స్‌ను అందించడంలో బ్రౌజర్‌కు సహాయం చేస్తుంది.

ఇక పిచాయ్ చెబుతున్న ప్రకారం.రాబోయే వారాలు, నెలల్లోనే టెస్టింగ్‌ కోసం ఇంప్రూవ్డ్‌ సెర్చింగ్‌ను ప్రవేశపెట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube