అంతరిక్షం… వర్ణించడానికి వీలుకాని ఓ కళాఖండం అని చెప్పుకోవచ్చు.అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు జరగగా మరెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అనే విషయాలను మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ కనిపెడుతూనే వుంటారు.
ఇప్పటికీ అంతరిక్షం వాతావరణం గురించి పరిశోధనలు అక్కడ నిరాటంకంగా జరుగుతూనే వున్నాయి.ఈ క్రమంలో జంతువులు, మొక్కల జీవనానికి అక్కడ ఆస్కారం వుంటుందా? అని పరిశోధనలు జరుగుతున్నాయి.ఇక మనిషి తొలిసారిగా 1961 లో అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసినదే కదా.

ఇకపోతే, అంతరిక్షంలో పిల్లలు పుట్టేందుకు అవకాశం వుందా? అన్న ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గత 62 ఏళ్లగా కారణం వెతుకుతూనే వున్నారు.కానీ ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు.అయితే, బ్రిటన్, నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం చెప్పబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓ నివేదిక ప్రకారం, బ్రిటీష్ శాస్త్రవేత్తలు డచ్ కంపెనీ స్పేస్‌బార్న్ యునైటెడ్ సహకారంతో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ ఇన్ స్పేస్ మాడ్యూల్‌ను ఒకదానిని తయారు చేస్తున్నారు.

ఈ మాడ్యూల్ ద్వారా బయో శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపి, IVF (ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స ద్వారా పిండాన్ని తయారు చేసి, అనంతరం దానిని భూమిపైకి తీసుకువచ్చి స్త్రీ గర్భంలోకి మారుస్తారట.అంటే అంతరిక్షంలో తయారైన పిండానికి భూమిపై పురుడుపోసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇలా పుట్టిన ఈ పిల్లలను ‘స్పేస్ బేబీస్’ అని పిలుస్తారట.
అయితే ముందుగా ఎలుకలపై ఈ ప్రయోగాలు చేయనున్నారు.ఎలుకల శుక్రకణాలు, గుడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి ఫలదీకరణ చేస్తారు.
మాడ్యూల్ సాంకేతికతను పరీక్షించే తొలి ఫ్లైట్ ఏప్రిల్‌లో కెనడా నుంచి బయలుదేరనున్నది.







