తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి అధికార భాష సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.
కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీనివాసుడి కృపా, కటాక్షాలు భారతదేశంపై ఎల్లవేళలా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో ఆంధ్ర కూడా తెలంగాణా రాష్ట్రం లాగా అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్రలో బిఆర్ఎస్ పార్టి బలోపేతం చేందే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు
.