దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఇప్పటికే చాలా సినిమాలు తీశారు.ముఖ్యంగా దిల్ రాజు సినిమాలని యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు ఆయన కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూనే సినిమాలు చేస్తారు అలా వరుసగా సినిమాలు చేస్తూ చాలా హిట్స్ ని అందుకున్నారు…ఒక టైం లో రైటర్ సతీష్ వేగేశ్న చెప్పిన కథ నచ్చి దిల్ రాజు ఆయనతో సినిమా చేయాలి అనుకున్నారు.
వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమాలో హీరోగా మొదట మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని తీసుకోవాలి అనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేదు దాంతో ఈ సినిమా లో హీరోగా రాజ్ తరుణ్ అయితే బాగుంటాడు అని దిల్ రాజు అనుకోని డైరెక్టర్ సతీష్ తో రాజ్ తరుణ్ కి కథ చెప్పించాడు.
ఆ కథ విన్న రాజ్ తరుణ్ సినిమా చేయడానికి ఓకే అన్నాడు.కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ కి దిల్ రాజు కి మధ్య గొడవ జరగడం తో రాజ్ తరుణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు…

ఆ తర్వాత దిల్ రాజు శర్వానంద్ కి ఈ కథ చెప్పి ఆయనతో ఈ సినిమా చేసారు.శర్వానంద్ కెరియర్ లోనే ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలిచింది అని చెప్పవచ్చు.అలాగే ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఈ సినిమా భారీ హిట్ అయ్యాక ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు రాజ్ తరుణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా బాగా డిస్పాయింట్ అయినట్లు తెలుస్తుంది…

దిల్ రాజు సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉంటాయి అందుకే చాలా మంది దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయాలని చూస్తుంటారు…ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకి శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు…
.







