వైరల్: చీరలు కట్టుకొని నదిలో డైవింగ్... చూస్తే బిత్తరబోతారు!

IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిణి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియోని చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరు అని ఖచ్చితముగా చెప్పొచ్చు.ఎందుకంటే మొదట మాకే దాన్ని చూసి ఏమి అర్ధం కాలేదు.

 Viral Diving In The River Wearing Sarees Will Make You Cringe, Woman, Stunds, V-TeluguStop.com

కళ్ళు బైర్లు కమ్మాక కాసేపు ఆగి మళ్ళీ చూసాక అది నిజమని అర్ధం అయింది.అవును, ఆ వీడియో చూసిన నెటిజన్ల మాటలివి.

చీర కట్టులో మన భారత స్త్రీలు ఎంత అందంగా వుంటారో తెలియంది కాదు.భారతీయ వనితకు వన్నె తెచ్చిన ఈ చీరలే.

అయితే అదే చీరకట్టులో ఎన్నో సాహసాలు కూడా చేయొచ్చని చూపిస్తున్నారు నేటి మహిళలు.

తమిళనాడులోని తామిరబరణి నదిలో చీరలు కట్టుకున్న కొంతమంది మహిళలు ఎత్తైన బ్రిడ్జి మీదినుంచి నదిలోకి అమాంతం కిందికి దూకి డైవింగ్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పెద్దవయసు మహిళలు, నడివయసు మహిళలు చీరలు కట్టుకుని ఆనందంతో నదిలోకి దూకడం, ఆ తరువాత స్నానం చేయడం, ఈదడం… మరలా మరలా పైనుండి దూకడం చూడవచ్చు.వీరంతా నిర్భయంగా, సంతోషంగా కేరింతలు పెడుతుంటే వారి వయస్సు ఇంకా 16 ఏళ్ల వయస్సు అనే అనుమానం కలగక మానదు.

ఈ వీడియోను షేర్ చేస్తూ.ఆ IAS ఆమె ఇలా రాసుకొచ్చారు.“చెన్నైలోని కల్లిడైకురిచి దగ్గరున్న తామిరబర్ని నదిలో స్త్రీలు చీరలు ధరించి మరీ డైవింగ్ చేయడం చూసి మొదట ఆశ్చర్యపోయాను.అయితే, అది వారికి సాధారణ వ్యవహారం కావచ్చు.

కానీ ఈ వీడియో ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనది.వీడియో ఎవరు తీశారో తెలియదు గాని స్నేహితుని ద్వారా ఫార్వార్డ్ లో వచ్చింది! నిజం అద్భుతం.

వీరు ఎంతమందికో స్ఫూర్తి ప్రదాతలు.ఇలాంటివారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.” అని రాసుకొచ్చారామె.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube