టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎక్కువ శాతం మంది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలకి ఒక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నారు.ఒకరు ఇద్దరు మాత్రం అప్పుడప్పుడు ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
యంగ్ హీరోలు కూడా ఏడాదికి రెండు సినిమాలు తీసుకు రావడంలో విఫలమవుతున్నారు.తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సంవత్సరానికి కచ్చితంగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
కానీ తెలుగు స్టార్ హీరోలు మాత్రం సంవత్సరంలో రెండు సినిమాలు విడుదల చేశారు అంటే అదే గొప్ప విషయంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి.

ఇక 2023లో ఏ హీరోలు రెండు సినిమాలతో వస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు వారి యొక్క వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు కూడా మరో రెండు సినిమాలతో ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుండగా బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో పాటు మరో సినిమా తో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక మహేష్ బాబు ఒకే ఒక్క సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.అదే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఏడాది ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న శంకర్ దర్శకత్వంలోని సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఎన్టీఆర్ ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ తర్వాత మరో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.ఇక ప్రభాస్ మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలతో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంతకు మించి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.
ఇక నాని దసరాతో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ తర్వాత కూడా మళ్లీ ఒక సినిమా ఉండే అవకాశం ఉంది.
మొత్తానికి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కొందరు హీరోలు ఈ ఏడాది కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోతున్నారు.








