బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగనా కేవలం సినిమాల విషయంలోనే కాకుండా కాంట్రవర్సీల ద్వారా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది.
తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా బాలీవుడ్ వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇది ఇలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో రకమైన పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా కంగనా రనౌత్ తనని ఎవరో టార్గెట్ చేశారని చెబుతోంది.

అంతేకాకుండా బాలీవుడ్ క్యూట్ కపుల్ అయిన రణ్ బీర్ కపూర్ అలియా భట్ ను ఉద్దేశించి కామెంట్లు చేసింది.తన ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని ఆమె తెలిపింది.అయితే ఆమె ప్రకటన చేసిన ఒక్క రోజులోనే తనను ఫాలో అవుతున్నవారు వెనక్కి తగ్గినట్లు ఆమె తెలిపింది.అంతేకాకుండా తనని ఫాలో అవుతున్న వారు ఆలోచననే విరమించుకున్నట్లు ఆమె తెలిపింది.
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఈ విధంగా రాసకొచ్చింది.నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి హెచ్చరిక.
గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదు.

కెమెరాలతో ఎవరు నన్ను అనుసరించలేదు.ఆ చాంగు మంగు గ్యాంగు నేను ఒకటే చెబుతున్నాను.నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే పొరపాటు.
ఇందులో ఎంత పెద్ద వారైనా సరే వదిలే ప్రసక్తే లేదు.ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్.
ఇకపోతే కంగనా సినిమాల విషయానికొస్తే.ఆమె ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది.అలాగే రజనీకాంత్ తమిళ్ సినిమా చంద్రముఖికి సీక్వెల్ చంద్రముఖి 2 సినిమాలో కూడా తాను నటించబోతున్నట్లు తెలిపింది.







