నా చేపల పులుసుపై కుట్ర జరుగుతోంది.. కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్!

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా కిర్రాక్ ఆర్పీ ఓవర్ నైట్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఆర్పీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల, పలు యూట్యూబ్ ఛానెళ్ల పబ్లిసిటీ వల్ల ఈ కర్రీ పాయింట్ పై సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.

 Kirrak Rp Shocking Comments Goes Viral In Social Media Details Here , Kirrak Rp-TeluguStop.com

ఈ కర్రీ పాయింట్ ను మొదలుపెట్టిన సమయంలో జనాలు బారులు తీరారు.కస్టమర్ల తాకిడి ఎక్కువ కావడంతో ఆర్పీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హవా తగ్గిందని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పబ్లిసిటీ ఉన్న స్థాయిలో చేపల పులుసు రుచి లేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో కిర్రాక్ ఆర్పీ స్పందిస్తూ తన చేపల పులుసు విషయంలో కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు.

Telugu Chepala Pulusu, Jabrdasth, Kiraakrp, Kirrak Rp, Nellore, Tollywood-Movie

పెయిడ్ బ్యాచ్ తన కర్రీ పాయింట్ విషయంలో కుట్ర చేస్తున్నట్టు కిర్రాక్ ఆర్పీ అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను నా కిచెన్ ను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నానని నాతో మాట్లాడిన వాళ్లంతా చేపల పులుసు రుచి బాగుందని చెప్పారని ఆయన అన్నారు.ఓర్వలేనితనం వల్ల కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని నేను వేర్వేరు రకాల చేపల పులుసును అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Chepala Pulusu, Jabrdasth, Kiraakrp, Kirrak Rp, Nellore, Tollywood-Movie

ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వంటకాల డెలివరీ జరుగుతుండటంతో కర్రీ పాయింట్ ముందు జనం తగ్గారని ఆర్పీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు విషయంలో ఆయన చెప్పిన మాటలు నిజమో కాదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube