సినీనటి, బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్.ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
బిగ్ బాస్ ముందు పలు సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్.తన పరిచయాన్ని అంతగా పెంచుకోలేక పోయింది.
పైగా ఎక్కువ సినిమాలలో కూడా నటించలేకపోయింది.కానీ ఒక్కసారి బిగ్ బాస్ అవకాశంతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.
పైగా వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకెళ్లింది.సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం బాగా రచ్చ చేసింది.మరో ఇద్దరు కంటెస్టెంట్ లతో బాగా సన్నిహితంగా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ను నడిపి అందరి దృష్టిలో పడింది.
ఎప్పుడు ఎమోషనల్ అవుతూ మరింత పరిచయం పెంచుకుంది.మరో కంటెస్టెంట్ అఖిల్ తో బాగా హంగామా చేసి హగ్, కిస్ లతో తెగ రెచ్చిపోయింది.
అలా కొంతకాలం వీరి మధ్య అదే సన్నిహితం ఉండటంతో.వీరు నిజంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి.
ఇక బుల్లితెరలో ఓంకార్ హోస్టింగ్ చేసినా ఓ రియాలిటీ డాన్స్ షోలో జడ్జిగా చేసింది.అంతేకాకుండా వెండితెరపై స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.గతంలో అఖిల్ తో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేయగా ఆ వెబ్ సిరీస్ అక్కడే ఆగిపోయింది.ఆ సమయంలో తనకు మంచి మంచి అవకాశాలను తన చేతులారా తానే ఆ కోల్పోయేలా చేసుకుంది.
కారణమేంటంటే బిగ్ బాస్ వల్ల తనకు వచ్చిన క్రేజ్ తో పారితోషికం విషయంలో కూడా బాగా డిమాండ్ చేసింది.దీంతో నిర్మాతలు తనను తమ ప్రాజెక్టులలో తీసుకోలేకపోయారు.
కేవలం సినిమాలలోనే కాకుండా షాప్ ఓపెనింగ్స్ విషయంలో కూడా మోనాల్ బాగా డిమాండ్ చేసిందని గతంలో బాగా వార్తలు వినిపించాయి.
ఇక ఈమె హైదరాబాద్ లో సెటిల్ కావడానికి కూడా కారణం.గతంలో తనకు వచ్చిన వరుస ఆఫర్లే.కానీ తాను పారితోషికం విషయంలో చేస్తున్న డిమాండ్ వల్ల తన అవకాశాలు కూడా అందుకోవడం లేదు.
ఇక ఇప్పుడు మోనాల్ అంతగా డిమాండ్ చేయడం లేదని.అందుకే పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా తన భాషలో బాగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇక ఈమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తుంది.
తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు తెగ ముచ్చట కూడా పెడుతూ ఉంటుంది.తన గ్లామరస్ ఫోటోలను తన ఫాలోవర్స్ కు బాగా షేర్ చేసుకుంటూ తెగ రచ్చ చేస్తుంది.
ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.
అందులో తను ముఖం మరింత అందంగా మారటానికి ఫేస్ కు బ్లాక్ కలర్ లో ఒకటి అప్లై చేసింది.దీంతో ఆ ఫోటో చూసి ఏంటి మసిపూసుకున్నావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.