పల్నాడు జిల్లా శ్రీనివాసపురం వైసీపీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది.దాచేపల్లిలో ఒక వర్గంపై మరో వర్గం వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలో సమస్యలపై కొందరు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు.
కార్యక్రమం ముగించుకుని ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత తమ ఇంటిపై కొందరు కార్యకర్తలు దాడి చేశారని బాధితులు వాపోయారు.నగదు, బంగారం సైతం దోచుకెళ్లారని ఆరోపించారు.