సినిమా ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఇటీవలే బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్ మరో సెలబ్రిటీ జంట అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాలు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కింది.
ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాశి రావత్.
తన ప్రియుడు నటుడు అయినా వాయిస్ ఆర్టిస్ట్ దృవాదిత్య భగ్వనానీ ని పెళ్లి చేసుకుంది.
తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.తాజాగా ఛత్తీస్‌ఘడ్ లో శనివారం ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది.ఇదే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వీరి హల్దీ, మెహందీ, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెళ్లి ఫోటోలు ఈ జంట ఎంతో చూడముచ్చటగా అనిపిస్తుండడంతో అభిమానులు నెటిజన్స్ ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సూపర్ జోడి,క్యూట్ కపుల్ అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.కాగా చిత్రాశి రావత్ షారుక్ ఖాన్ చక్ దే ఇండియా సినిమాలో హాకీ ప్లేయర్ కోమల్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇటీవల ఆమె తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ధ్రువ్‌తో బిలాస్‌పూర్‌లో తన పెళ్లి జరగబోతోందని, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని సింపుల్‌గా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది.







