ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ నాలుగు ప్రయోజనాలను ఇలా పొందవచ్చు!!

దుబాయ్‌కి చెందిన ‘ది టాక్స్ ఎక్స్‌పర్ట్స్ డీఎంసీసీ మేనేజింగ్ డైరెక్టర్ దీక్షిత్ జైన్ తాజాగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు.ఆయన ప్రకారం ఈ బడ్జెట్ వల్ల ఎన్నారై లకు నాలుగు ప్రయోజనాలు కలగనున్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 These Four Benefits For Nris Obtained By Budget 2023 Deails, Nris, Tax Residency-TeluguStop.com

1.ఎన్నారైలు త్వరలో తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై తక్కువ పన్నులను మాత్రమే కట్టుకోవచ్చు.జైన్ ప్రకారం, పన్ను రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) పొందడం ద్వారా, ఎన్నారైలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వారి ఆదాయంపై విధించిన 20% పన్నును తగ్గించవచ్చు.ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.

2.అదనంగా, బంధువులు కాని వారి నుంచి రూ.50,000 కంటే ఎక్కువ నగదు బహుమతులు పొందుతున్న ఎన్నారైలు 2024, ఏప్రిల్ 1 నుంచి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.ఇది ‘రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్’ (RNOR) హోదా కలిగిన వ్యక్తులకు వర్తిస్తుంది.అంటే 10 ఆర్థిక సంవత్సరాల్లో 9 సంవత్సరాలు ఎన్నారైలుగా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.

Telugu Budget, Nribudget, Nri, Nris, Tax Benefits, Taxresidency, Taxdmcc-Telugu

3.ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో (ODI) పెట్టుబడులపై IFSC బ్యాంకింగ్ యూనిట్ (IBU) ద్వారా ఆర్జించే ఆదాయానికి 2 సార్లు పన్నులు విధించే ప్రస్తుత నియమానికి కూడా భారత ప్రభుత్వం మార్పులను ప్రతిపాదించింది.ప్రస్తుతం, ఈ ఆదాయం మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్‌ల కింద సెక్షన్ 115AD కింద పన్ను విధించబడుతుంది.ప్రస్తుతానికి మొదట IBU ద్వారా స్వీకరించబడినప్పుడు, మళ్లీ ప్రవాస ODI హోల్డర్‌లకు పంపిణీ చేసినప్పుడు ఈ పన్ను విధించడం జరుగుతుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి, డబుల్ టాక్సేషన్‌ను తొలగించడానికి ఈ నిబంధనను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Telugu Budget, Nribudget, Nri, Nris, Tax Benefits, Taxresidency, Taxdmcc-Telugu

4.చివరగా, వ్యాపార ట్రస్టుల ద్వారా పెట్టుబడి పెట్టే నాన్-రెసిడెంట్ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి మరో ప్రతిపాదన చేసింది.అదేంటంటే ఈ ఇన్వెస్టర్లు సర్టిఫికేట్‌ను పొందే అవకాశాన్ని కోల్పోయినా అర్హులుగా ఉండేలా నిబంధనను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ మార్పు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube