పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ అర్జున్ రెడ్డి పనిమనిషి.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

 Arjun Reddy Maid Vanita Kharat Ready For Marriage Pics Viral Details, Arjun Redd-TeluguStop.com

తెలుగులో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు విజయ్ దేవరకొండ క్రేజ్ ని, ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది.ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ నుంచి టెక్నిషియన్ ల వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు దక్కింది.

కాగా అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో ఈ సినిమాను తమిళంలో హిందీలో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

తమిళంలో విక్రమ్ కొడుకు దృవ్ హీరోగా నటించగా హిందీలో షాహిద్ కపూర్ నటించాడు.అయితే తమిళంతో పోలిస్తే హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు చాలామంది తెలుగు ప్రేక్షకులు హిందీలో చూసి ఆనందించారు.కాగా హిందీలో ఈ సినిమా దాదాపుగా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

హిందీ అర్జున్ రెడ్డి సినిమాలో నవ్వులు పూయించే పాత్ర ఏదైన ఉందంటే అది పనిమనిషి పాత్రే అని చెప్పవచ్చు.హిందీలో ఈ పాత్ర చేసిన నటి వనితా కారత్.

హిందీ అర్జున్ రెడ్డి సినిమాలో వనిత తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వనిత ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది.కాగా ఇటీవల తన స్నేహితుడితో ఆమెకి నిశ్చితార్థం జరిగగా ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా మెహందీ, మంగళ స్నానాలు, ఇతర వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియయా ఖాతాలో షేర్ చేసింది.ఆ ఫోటోల ను చూసిన అభిమానులు, నేటిజన్స్, పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube