టాలీవుడ్ బుల్లితెర నటి, బిగ్ బాస్ బ్యూటీ హిమజ.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తొలిసారిగా బుల్లితెరపై ప్రసారమైన సీరియల్ లో తన నటన ను పరిచయం చేసింది హిమజ.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు నటన పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.
బుల్లితెరపై ఈమె భార్యమణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి దారావాహిక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత వెండి తెరపై అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసింది.
ఇక వెండితెరపై కూడా తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది హిమజ.వచ్చిన అవకాశాలను కాదనకుండా ఓకే చెప్పేస్తుంది.
పలు అడ్వర్టైజ్మెంట్లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం ఏదో ఒక షేర్ల తో బిజీగా ఉంటుంది హిమజ.ఇక ఈమె గతంలో.
స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని బాగా సందడి చేసింది.హౌస్ లో ఉన్నంతకాలం తోటి కంటెస్టెంట్లతో బాగా సరదాగా ఉండేది.
తన ఆట తీరుతో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అలా బిగ్ బాస్ తర్వాత ఫాలోయింగ్ అనేది పెంచుకుంది.ఇక హిమజ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది.ఈమె ఎప్పుడూ గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.
ఈమె వేసుకున్న బట్టలు కూడా అందాలను కవర్ చేస్తూ ఉంటాయి.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తూ ఉంటుంది.
యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుంది.అందులో కూడా మంచి మంచి వీడియోలు పంచుకుంటూ ఉంటుంది.
తనకు ఖాళీ సమయం దొరికితే ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు లైవ్ కాల్స్ ద్వారా కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఇన్ స్టా లో కొన్ని కొన్ని సార్లు ఫన్నీ వీడియోస్ చేస్తూ బాగా ఆటపట్టిస్తూ ఉంటుంది.హిమజ కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ కూడా చాలా అందంగా ఉంటుంది.తను ఏ డ్రెస్ వేసినా కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
నిజానికి ఈమె హీరోయిన్ మెటీరియల్ అనాలి.కానీ దురదృష్టం కొద్దీ చిన్న ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో బ్లాక్ సారీలో తన అందాలతో విందు వడ్డించింది అని చెప్పాలి.
ఎంతో క్యూట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను బాగా ఫిదా చేసింది.చాలా అందంగా ఉన్నావు అంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.
ఇక ఓ అభిమాని మాత్రం అచ్చం ప్రగ్యా జైస్వాల్ లాగా ఉన్నావు అంటూ పొగిడారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







