టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల. ఇక ఈమె ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం చేయకపోగా వ్యక్తిగతంగా మాత్రం బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇక ఈమె భర్త కళ్యాణ్ దేవ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు.ఇక శ్రీజ మెగా కాంపౌండ్ కి సంబంధించిన పలు ఈవెంట్లలో పాల్గొనడం వల్ల తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.
ఇక కళ్యాణ్ దేవ్ శ్రీజకు రెండో భర్త.ఎందుకంటే శ్రీజ ఇదివరకే ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది.ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది శ్రీజ.ఆ సమయంలో చిరంజీవి ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది.
ఆ సమయంలో ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా శ్రీజ గురించే వార్తలు వచ్చాయి.అంతేకాకుండా చిరంజీవిని కూడా చాలామంది విమర్శించారు.
కూతురిని సరిగ్గా పెంచలేనివాడని రకరకాలుగా విమర్శలు చేశారు.ఇక చివరికి చిరంజీవి చేసేదేమీ లేక తన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు.బయట జనాలు మాటలు పట్టించుకోకుండా తన కూతురిని మళ్లీ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు.శ్రీజకు మొదటి భర్తతో ఒక కూతురు కూడా పుట్టింది.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది.

తర్వాత కొంతకాలానికి చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేయించాడు.ఇక రెండవ భర్తతో కూడా ఒక కూతురుని కన్నది శ్రీజ.ఇక మొదటి భర్త బిడ్డను కూడా కళ్యాణ్ దేవ్ సొంత కూతురిలా చూసుకున్నాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే ఆ మధ్య కళ్యాణ్ తో కూడా శ్రీజ సరిగా ఉండటం లేదు అని బాగా వార్తలు వినిపించాయి.కానీ అది ఎంతవరకు నిజమో ఇప్పటికీ తెలియలేదు.
ఇక శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
తన కూతుర్ల ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తుంది.అంతే కాకుండా తన కూతుర్లతో చేసిన డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా తన తండ్రి తరపున ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె షేర్ చేసిన స్టోరీ పట్ల అందరూ షాక్ అవుతున్నారు.అదేంటంటే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం జుకల్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.గతంలో సమంత విడాకుల సమయంలో ఇతడి పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇతడి వల్లే సమంతకు విడాకులు అయ్యాయని వార్తలు కూడా వచ్చాయి.
ఇక అప్పటినుంచి ప్రీతం ప్రతి విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
ఇక ఇతడి డిజైన్లను సమంతతో పాటు రాశి ఖన్నా, స్నేహ రెడ్డి, లావణ్య త్రిపాఠి ఇలా పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతూ ఉంటారు.అందులో శ్రీజ కొణిదెల ఒకరు.
అయితే తాజాగా అతడు శ్రీజ తో దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా లవ్ సింబల్స్ తో పంచుకున్నాడు.దీంతో ఆ స్టోరీని శ్రీజ కొణిదెల రీస్టోరీ చేస్తూ హగ్ అండ్ కిస్ అంటూ షేర్ చేసింది.
దీంతో ఆ స్టోరీ చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.ఎంత ఫ్యాషన్ డిజైనర్ అయినా కూడా కిస్ అని పంచడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.







