ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే జుట్టు ఎంత తీవ్రంగా రాలుతున్న సరే చెక్ పెట్టడానికి ఒక మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ ఉంది.ఈ రెమెడీని పాటిస్తే సులభంగా మరియు వేగంగా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక పది కుంకుడుకాయలను తీసుకుని బ్రేక్ చేసి వాటిలో ఉన్న గింజలను తొలగించాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గింజ తొలగించిన కుంకుడుకాయలు వేసుకోవాలి.అలాగే ఏడు నుంచి ఎనిమిది అశ్వగంధ మూలికలు వేసి రెండు గ్లాసుల వాటర్ పోసి నైట్ అంత నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న కుంకుడు కాయలు మరియు అశ్వగంధ మూలికలను వాటర్ తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ మరియు వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం అనేది క్రమంగా తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.
అలాగే ఈ పవర్ ఫుల్ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు పట్టుకుచ్చులా సైతం మెరుస్తుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.