పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఒకవైపు రాజకీయాలు.
మరో వైపు సినిమాలు.ఇలా పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు.2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పవన్ మరో వైపు సినిమాలు కూడా వదలకుండా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు.అయితే పవన్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరో సినిమా రిలీజ్ చేయలేదు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్లు ముగిసిన ఇంకా పూర్తి కాలేదు.
అందుకే ఇప్పుడు ఫుల్ ఫోకస్ తో ఈ సినిమా షూట్ చేస్తూ సమ్మర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.మరో వైపు వారాహి వాహనం మీద ఏపీ ఎన్నికల కోసం కష్టపడుతున్నాడు.
ఎలెక్షన్స్ రానున్న నేపథ్యంలో ఫుల్ ఫోకస్ గా ఉన్నారు.
ఇక ఈయన సినిమాలు వీరమల్లు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.అలాగే వినోదయం సీతం రీమేక్ లో కూడా పవన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మరి పవన్ కళ్యాణ్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్న కూడా ఏ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియడం లేదు.అలాగే అటు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈసారి ఏపీతో పాటు తెలంగాణాలో కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు.
మరి రెండింటితో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ దేనికి సమయం కేటాయిస్తాడా అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.