ఆ హీరోయిన్ తో అభిషేక్ పాఠక్ పెళ్లి.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఇక టాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ చేసుకోగా బాలీవుడ్ లో ఇటీవలే అతియా శెట్టి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

 Shivaleeka Oberoi Confirms February Wedding With Drishyam 2 Director Abhishek Pa-TeluguStop.com

కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్కూ డా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు.హిందీ దృశ్యం 2 సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ అభిషేక్ పాఠక్.

కాగా డైరెక్టర్ అభిషేక్,హీరోయిన్ శివలేఖ ఒబెరాయ్‌ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఇదే విషయాన్ని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చెప్పకనే చెప్పేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఆకాశంలో అన్ని నక్షత్రాలుండగా, సముద్రం ఒడ్డున ఇన్ని నక్షత్ర చేపలుండగా అతడు మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా నావైపే చూస్తున్నాడు అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది.

అయితే ఆ ఫోటోలో అభిషేక్ ముఖం కనిపించకుండా బ్లర్ చేసింది.అది చూసిన అభిమానులు త్వరలోనే వీరు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా వీరిద్దరూ గోవాలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు కోడై కూస్తున్నాయి.అయితే వీరి పెళ్లి అది కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే ఆ జంట అధికారికంగా స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.కాగా ఖుదా హఫీజ్‌ 1, 2 సినిమాల్లో నటించగా ఆ సినిమాలకు అభిషేక్‌ పాఠక్‌ నిర్మాతగా వ్యవహరించాడు.ఆ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారి త్వరలోనే పెళ్లి పిట్టలు కూడా ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube