తన హాస్య నటనతో తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న బ్రహ్మానందం కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు.
ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా బ్రహ్మానందం ఎక్కువ సినిమాలలో నటించలేకపోతున్నాడు.అయినప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు.ఈరోజుతో ఈయన 67వ ఏట అడుగుపెట్టారు.

బ్రహ్మానందం మొదట తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహించేవాడు.ఆ తర్వాత సినిమా అవకాశాలు రావటంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.ముఖ్యంగా ఆహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఆ సినిమాకు హైలైట్ గా నిలిచింది.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ తర్వాత నుండి బ్రహ్మానందంకి కామెడీ పాత్రలకు వరుస ఆఫర్లు దక్కాయి.
ఒకానొక దశలో ఏడాది మొత్తం విడుదలైన ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం కామెడీ ఉండేది.అంతలా ఈయన కామెడీకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు.ఇప్పటికీ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన బ్రహ్మానందం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండేది.ఒకానొక సందర్భంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు.బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కి దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడు.
ఇలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం తన పారితోషికాన్ని సగం భూములపై ఇన్వెస్ట్ చేశారు.ఇలా ఆయన పొదుపు చేసిన స్థిర, చరాస్థులు అన్ని కలిపితే.దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.అంతేకాదు డబ్బు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరంచిడంతో పాటు మరే దురలవాట్లు లేని కారణంగా బ్రహ్మానందం వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.







