సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగకుండానే విడాకులు తీసుకున్నారు.
ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తుంది.
పుష్ప ఐటెం సాంగ్ తో ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.
అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకున్న ఈమె ఈ మధ్యనే షూట్ లో పాల్గొంటుంది.

ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో చేరింది.మరి ఈ సిరీస్ నుండి తాజాగా సమంత లుక్ బయటకు వచ్చింది.ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లు డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.సమంత కూడా కీలక రోల్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ నుండి మేకర్స్ ఈ రోజు సామ్ లుక్ ను రిలీజ్ చేసారు.

ఈ లుక్ ఇప్పుడు ఈమె ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.ఎన్నో రోజుల తర్వాత సమంత మళ్ళీ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.ఈమె లుక్ డిఫెరెంట్ గా స్టైలిష్ గా కూడా ఉంది.ఈ స్టైలిష్ లుక్ చూసి ఈమె ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.ఇక ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తున్నారు.త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సిరీస్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
చూడాలి సమంతకు ఈ డైరెక్టర్లు మరో హిట్స్ ఇస్తారో లేదో.








