సాధారణంగా అబ్బాయిలు కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో బాగా రాణిస్తుంటారు.మహిళలు వారిలాగా గొప్పగా రాణించలేరనే భావన ఒకటి ప్రజల్లో ఉంది.
అయితే అమ్మాయిలు మగవారి కంటే ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తూ ఒక్కోసారి తమ సత్తా చాటుతున్నారు.కాగా తాజాగా ఒక అమ్మాయి నెక్ట్స్ లెవెల్‌లో స్కిల్స్ ప్రదర్శించి నెటిజనులను అబ్బురపరుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది.

మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలంటే చాలా పట్టుదల కావాలి.అలాగే ఏకాగ్రత కూడా అవసరమే.అలానే చాలా పేషన్స్ ఉండాలి.
అప్పుడే సెల్ఫ్ డిఫెన్స్ ఫైట్స్‌లో నైపుణ్యం సాధించడం సాధ్యమవుతుంది.అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్న యువతి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.
ఎందుకంటే ఈ యువతి మార్షల్ ఆర్ట్స్ లో అత్యంత కష్టమైన నాంచాకుతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.ఈ యువతి నాంచాకు పట్టుకొని వాటితోనే కొవ్వొత్తులను వెలిగించింది.
అలాగే ఆర్పేసింది.కళ్లకు గంతలు కట్టుకొని కూడా కొవ్వొత్తులను ఆర్పేసింది.
అంతేకాదు, రెండు బాటిల్స్ మధ్య ఉన్న ఒక పేక ముక్కను చాలా కచ్చితంగా తీసేసి వాటిలోని డ్రింక్స్ కలిసిపోయేలా చేసింది.

నాంచాకు తిప్పడం చాలా రిస్కీ.కానీ ఈమె ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా దానిని వంటి చేత్తో గిరగిరా తిప్పుతూ అనేక కళలను కళ్ళకు కట్టినట్టు చూపించింది.ఇవన్నీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ అనే ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.‘స్టన్నింగ్ పర్ఫామెన్స్’, ‘ఆసమ్‘ అని ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.







