ఈ భూప్రపంచంపై సహజ వనరులు కొరత కారణంగా ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పునరుత్పత్తి శక్తిపై ఆధారపడాల్సిందిగా కోరుతున్నాయి.ఇందుకు అనుగుణంగా సూర్యకాంతిని ఉపయోగించుకుని కరెంటు సృష్టిస్తున్నారు.
అలాగే సూర్యరశ్మిని ఉపయోగించుకొని నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సాంప్రదాయ కరెంటు అవసరం లేని సోలార్ పవర్ బ్యాంక్ కూడా తీసుకొచ్చారు.
దీని సహాయంతో ప్రజలు తమ మొబైల్, ల్యాప్‌టాప్స్‌కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.దీనివల్ల సాంప్రదాయ కరెంటు వినియోగం తగ్గుతుంది.
సూర్యకిరణాల వల్ల ఈ సోలార్ పవర్ బ్యాంక్ ఛార్జ్ అవుతుంది.దాన్ని ఉపయోగించి మొబైల్, ల్యాప్‌టాప్స్‌కి ఛార్జింగ్ పెట్టవచ్చు.ఈ సోలార్ పవర్ బ్యాంక్‌ను ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.
కరెంటు అసలు అవసరం లేకుండా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను త్వరగా ఛార్జ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

సాధారణ పవర్ బ్యాంక్స్ ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయలు పైనే ఉంటాయి.అయితే సోలార్ పవర్ ధర కూడా రూ.2 వేల లోపే ఉండటం వినియోగదారులకు ఒక మంచి న్యూస్ అని చెప్పవచ్చు.ఇది చూసేందుకు సాధారణ పవర్ బ్యాంక్ లాగానే కనిపిస్తుంది కాకపోతే సూర్యకాంతితో ఛార్జ్ అవుతుంది.సాధారణ పవర్ బ్యాంక్ కంటే సైజులో కాస్త పెద్దగా ఉండే ఈ పవర్ బ్యాంక్ పైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి.

వీటి ద్వారానే సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మారుతుంది.అలా ఛార్జింగ్ ఎక్కుతుంది.సోలార్ పవర్ బ్యాంక్‌లు పర్యావరణ హితమైనవి, ఎందుకంటే అవి పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తాయి.వీటికి ఎక్స్‌టర్నల్ విద్యుత్ సోర్స్ అవసరం లేదు.సోలార్ పవర్ బ్యాంక్‌లలో కెపాసిటీ, ఛార్జింగ్ వేగం మారవచ్చు.సోలార్ ప్యానెల్ పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
సోలార్ పవర్ బ్యాంక్‌ను దాని ఛార్జింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి నేరుగా సూర్యకాంతి ఉన్న ప్రదేశంలో స్టోర్ చేయడం ముఖ్యం.







