33వ పెళ్లి రోజున జరుపుకున్న హీరో విజయకాంత్.. ఫొటోస్ వైరల్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సినిమాలలో నటిస్తూనే కొన్ని కొన్ని ఆరోగ్య కారణాలవల్ల సినిమాలకు దూరం అవుతూ ఉంటారు.అలాగే ఇంకొందరు వయసు మీద పడే కొద్ది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

 Actor Vijayakanth Wedding Anniversary Photo Goes Viral,vijayakanth, Kollywood, W-TeluguStop.com

అలా ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కెరియర్ బాగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా స్ట్రగుల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా కూడా ఒక సీనియర్ స్టార్ హీరో ని చూసి అభిమానులు పాపం ఆడంతోపాటు ఆ హీరోని చూసి షాక్ అవుతున్నారు.

ఒకప్పుడు వందల సినిమాలలో నటించిన ఆ హీరో ప్రస్తుత పరిస్థితి చూసి అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.ఆ స్టార్ హీరో మరెవరో కాదు కెప్టెన్ విజయకాంత్.

తమిళ స్టార్ హీరో అయిన విజయకాంత్ కెరియర్ మొత్తంలో కేవలం తమిళ భాషలోనే సినిమాలు చేసిన నటనలో విజయ్ కాంత్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.తమిళ ఇండస్ట్రీలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు డిఎండికె పార్టీని స్థాపించి రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయంలో కూడా విజయం సాధించి తనదైన ముద్రను వేసుకున్నారు విజయకాంత్.కాగా విజయకాంత్ నటించిన సినిమాలు తెలుగుతోపాటు హిందీలో కూడా డబ్బింగ్ అవుతూ వచ్చాయి.

ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా విజయ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు కాగా గత కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు విజయకాంత్.షుగర్ వ్యాధి కారణంగా వైద్యులు గత ఏడాది ఆయన కాలి మూడు వేళ్లను కూడా తొలగించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయకాంత్ 33వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు.ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా విజయ్ కాంత్ 1990లో జనవరి 31వ తేదీన ప్రేమలతను పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి అయ్యి 33 సంవత్సరాలు అయిన సందర్భంగా దంపతులిద్దరూ పూలమాలలను మార్చుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో ని చూసి అభిమానులు ఏంటి మా అభిమానిస్తారు హీరో ఇలా అయిపోయారు అని బాధపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube