తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ పేరిట మరో నోటిఫికేషన్ విడుదల అయింది.వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉభయసభలను ఉద్దేశించి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ప్రోరోగ్ చేయకుండా ఎనిమిదవ సెషన్ కొనసాగింపని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.







