నాన్న బెల్ట్ తెగేలా కొట్టేవాడు.. కలర్ ఫోటో హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుహాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కలర్ ఫోటో.

 Actor Suhas Posts Emotional Note About His Film Journey ,suhas,tollywood, Writer-TeluguStop.com

ఈ సినిమాతో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సుహాస్.కాగా మొదట యూట్యూబర్ గా కెరిర్ ను ప్రారంభించి ప్రస్తుతం వెండితెరపై నటుడుగా అలాగే హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే సుహాస్ తాజాగా హీరోగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సుహాస్ తన సొంత ఊరు విజయవాడలో తనకు ఎంతో ఇష్టమైన రాజ్ యువరాజ్ థియేటర్లో రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ వేసారంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు.అబ్బో.ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ.

సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవడం.కాలేజీ మానేసి మార్నింగ్‌, మ్యాట్నీ షోలకు హాజరు కావడం.

చిరిగిపోయే టికెట్‌ కోసం లైన్‌లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయడం.ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం.

సినిమా ఛాన్స్‌ కోసం చెప్పులు అరిగేలా తిరగడం.

వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండితెర వెయిటింగ్‌లో పడి ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ కావడం.దానికి జాతీయ అవార్డు రావడం.ఫైనల్‌గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి సినిమా రిలీజ్‌, మొదటి ప్రీమియర్‌ పడటం.

అబ్బో ఈ ఫీలింగ్‌ ఏంటో మామూలుగా లేదుగా రా సుహాసూ రాసుకొచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube