దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి... అసహనం వ్యక్తం చేసిన సింగర్ శ్రీరామ చంద్ర!

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీరామచంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండియన్ ఐడల్ విన్నర్ గా అలాగే బిగ్ బాస్ ద్వారా కూడా ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ లకు ఒక విన్నపం చేశారు.

 Singer Sreerama Chandra Complaints To Cm Kcr Ktr For His Flight Missed Details,-TeluguStop.com

సాధారణంగా ఒక పొలిటీషియన్ ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకున్న లేదా ఒక ర్యాలీ చేసిన పెద్ద ఎత్తున రహదారులు మొత్తం బ్లాక్ చేస్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలాంటి ఇబ్బందులను సింగర్ శ్రీరామచంద్ర కూడా ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.తాను ఓ ఈవెంట్ లో పాల్గొనడం కోసం గోవా వెళ్లాల్సి ఉంది.అయితే తాను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యానని తెలిపారు.

ఇలా శ్రీరామచంద్ర గోవా వెళ్లే ఫ్లైట్ మిస్ కావడానికి గల కారణం ఒక పొలిటీషియన్ కోసం పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ మొత్తం బ్లాక్ చేశారని అక్కడ బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ చేయడంతో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ కావటం వల్ల దాదాపు అరగంట లేట్ అయిందని దాంతో తన గోవా ఫ్లైట్ మిస్ అయిందని తెలిపారు.

కేవలం తను మాత్రమే కాకుండా తనతో పాటు మరో ఇద్దరు కూడా ఇదే కారణం చేత ఫ్లైట్ మిస్ అయ్యారని ఈ వీడియోలో శ్రీరామచంద్ర తెలియజేశారు.ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ అలాగే హైదరాబాద్ పోలీసులకు ఈయన తన విన్నపాన్ని తెలియజేస్తూ పొలిటికల్ లీడర్స్ కోసం సామాన్య ప్రజలను దయచేసి ఇబ్బంది పెట్టకండి అంటూ ఈ వీడియో ద్వారా కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం శ్రీరామచంద్ర షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube