దేశ రాజధాని ఢిల్లీ జంతర్‌మంతర్‌లో టీజేఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.విభజన హామీల అమలు, కృష్ణానదీ జలాల సమస్యలపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.
కోదండరామ్ మౌనదీక్షకు దిగారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కేంద్రానికి వినతిపత్రం అందజేస్తామని ఈ సందర్భంగా ప్రొ.
కోదండరామ్ తెలిపారు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాతో పాటు విభజన హామీల కోసం టీజేఎస్ ఆందోళనలు ఉధృతం చేస్తుందని తెలిపారు.
కేసీఆర్ కు అధికారం, రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు.ఆఖరుకు రాజ్యాంగాన్ని, గవర్నర్ వ్యవస్థను సైతం కేసీఆర్ గౌరవించడం లేదని ఆరోపించారు.







