గోల్ఫ్ క్రీడలో తిరుగులేని రారాజు టైగర్ వుడ్స్.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

గోల్ఫ్ క్రీడలో తిరుగులేని రారాజుగా పేరొందిన టైగర్ వుడ్స్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.గోల్ఫ్ క్రీడను శాసించిన చక్రవర్తిగా టైగర్ వుడ్స్‌ను అంతా కీర్తిస్తుంటారు.

 Golf Star Player Tiger Woods Inspirational Story Details, Sports News, Sports Up-TeluguStop.com

దాదాపు చాలా ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగుతున్న టైగర్ వుడ్స్‌కు టైగర్ అని పేరు పెట్టడమే కాదు, మైదానంలో మరియు వెలుపల టైగర్‌లా వెలుగొందాడు.ముందుకెళ్లాలనే తపన ఉన్న వ్యక్తిని ఎవరూ ఆపలేరని, టైగర్ వుడ్స్ చాలాసార్లు నిరూపించుకున్నారని చెప్పారు.

టైగర్ వుడ్స్ పలుమార్లు తీవ్ర ప్రమాదాలకు గురయ్యాడు.అతను ఇంక పుంజుకోలేడని అంతా భావించారు.

అయితే ప్రతిసారీ అంతే బలంగా మైదానంలోకి వచ్చి పెద్దపెద్ద టైటిళ్లు సాధించాడు.గోల్ఫ్ చాలా ఖరీదైన ఆటగా పరిగణించబడుతుంది.

టైగర్ ఈ గేమ్‌లో ఛాంపియన్.అతడి గురించి తెలుసుకుందాం.

1996లో కెరీర్ ప్రారంభించిన టైగర్ వుడ్స్ ఆ మరుసటి ఏడాది 1997లో మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.8 ఏళ్ల వయసులోనే కీలకమైన 80 పాయింట్ల స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.2021లో అతను కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.అది అతని పనితీరును ప్రభావితం చేసింది.

అదే సమయంలో అతడి వివాహేతర సంబంధాలు వెల్లడయ్యాయి.అవి అతడి ఆటతీరుతో పాటు కుటుంబంలో కలతలకు కారణం అయ్యాయి.

Telugu Golf, Latest, Ups, Tiger Woods, Tigerwoods-Latest News - Telugu

అతడు బరిలోకి దిగితే మిగిలిన ఆటగాళ్లు రెండవ స్థానం గురించి ఆలోచించేవారు.ఆటపై అంతలా ఆధిపత్యం చెలాయించాడు.అతడిని నిలువరించేందుకు ఆటలో నియమాలు మార్చాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.ఇక 26 సంవత్సరాల కెరీర్‌లో, వుడ్స్ 15 గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.కెరీర్‌లో చాలా సంవత్సరాలు ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్‌గా కొనసాగాడు.

Telugu Golf, Latest, Ups, Tiger Woods, Tigerwoods-Latest News - Telugu

ఫలితంగా అతను వందలాది ప్రపంచ స్థాయి బ్రాండ్లకు ఖరీదైన ప్రకటనలు చేసాడు.ఫోర్బ్స్ ప్రకారం, వుడ్స్ 2002 నుండి 2012 వరకు అంటే వరుసగా 10 సంవత్సరాలు ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడు.ఆ సమయంలో అత్యధిక పారితోషికం పొందిన క్రీడాకారుల జాబితాలో వుడ్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.అతని కెరీర్ ప్రారంభం నుండి, అతను $ 1.7 బిలియన్లను సంపాదించాడు.జీవితంలో పడినా తిరిగి లేవాలనుకునే వారికి అతడు స్పూర్తిదాయకంగా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube