కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము సత్యవంతులమని చెప్పట్లేదన్నారు.
వైసీపీ పాలనలో చిన్న చిన్న అవకతవకలు జరగొచ్చని ఎమ్మెల్యే తెలిపారు.కావలిలో అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇళ్లు, రోడ్ల కోసం గ్రావెల్ తవ్వకాలకు పర్మిషన్లు తీసుకోవడం లేదని మండిపడ్డారు.ఇప్పటికన్నా టీడీపీ హయాంలోనే ఎక్కువ అవినీతి జరిగిందని ఆరోపించారు.
అసలు దొంగలు టీడీపీ నేతలేనన్నారు.బీద రవిచంద్ర రూ.400 కోట్ల గ్రావెల్ దోపిడీ చేశారని, అధికారులను బ్లాక్ మెయిల్ చేసేది టీడీపీ నాయకులేనని ఆరోపించారు.







