గద్వాల్ కోటలో డీకే అరుణ పాగా వేస్తారా..?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా డీకే అరుణకు పేరుంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ వేదికగా.

ఆమో రాజకీయం నడుపుతూ ఉన్నారు.డీకే ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది.

సుమారు 1957 నుంచి ఇక్కడ డీకే ఫ్యామిలీనే జెండా పాతుతూ వస్తోంది.రాష్ట్రంలో ఎలాంటి పార్టీ వచ్చినా.

గద్వాల్ కోటలో మాత్రం కేవలం డీకే ఫ్యామిలీనే చక్రం తిప్పింది.చాలా సార్లు డీకే ఫ్యామిలీ నుంచి ఇండిపెండెట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.1957లో డీకే సత్యారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపోందారు.ఇక అక్కడి నుంచి వారి వారసత్వ పరంపర కొనసాగుతూ వచ్చింది.

Advertisement

సత్యారెడ్డి.తర్వాత ఎన్నికల్లో బీజేపీ నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.

ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన డీకే సమరసింహా రెడ్డి 1983, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతరపున విజయకేతనం ఎగుర వేశారు.ఇక 1994లో డీకే భరత సింహా రెడ్డి ఇదే గద్వాల్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు.

వాళ్ల తర్వాత డీకే అరుణ మొదటి సారి 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గద్వాల్ నుంచి పోటీ చేసి.తిరుగులేని మెజారిటీతో గెలిచింది.తర్వాత వచ్చిన 2009, 2014 ఎన్నికల్లో కూడా ఆమె విజయం సాధించారు అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో స్వయాన తన మేనల్లుడు చేతిలో పరాభవం పాలయింది.

దాంతో ఆమె మనస్థాపానికి గురై బీజేపీలో చేరారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సారి ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాను కాషాయమయంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.స్థానికంగా తాను గెలిస్తే.పార్టీని ఆ ప్రాంతంలో స్ట్రాంగ్ గా చేయోచ్చనేది ఆమె వ్యూహం.

Advertisement

దానికి బీజేపీ అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్లకు పెద్దగా పట్టు లేదు.

కేసీఆర్ మేనియాతో అక్కడ 2018 ఎన్నికల్లో గెలిచారు.ఈ పారి ఎన్నికల్లో మాత్రం ఆయనకు విజయావకాశాలు లేవని నివేదికలు చెబుతున్నాయి.

ఇక గద్వాల్ జేజమ్మ డీకే అరుణకు ఇక్కడ గెలుపు నల్లేరు మీద నడకేం కాదు.కాంగ్రెస్ పార్టీకి గద్వాల్లో కొంతమేర బలమైన ఓటు బ్యాంకు ఉంది.

అది చీలితే కానీ ఆమెకు ఈ సారి విజయం దక్కదు.ఒక వేళ కాంగ్రెస్ కేడర్ చీలిపోయి.

డీకే ఫ్యామిలీ సొంత కేడర్ యాక్టివ్ అయితే ఆమె గెలుపును ఎవరూ ఆపలేరు.మరి ఈ సారి ఆమె గెలిచి బీజేపీకి వైభవం తీసుకు వస్తుందా.? లేక మరో సారి ఓడి పరువు పోగుట్టుకుంటారా చూడాలి.

తాజా వార్తలు