వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఫ్యాన్స్ కి షాకిచ్చిన వర్షబొల్లమ్మ.. వైరల్ స్టోరీ?

అప్పుడప్పుడు సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ కి బాగా షాకుల మీద షాక్ లు ఇస్తూ ఉంటారు.ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయంలో మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

 Varshabollamma Shocked Fans By Saying Wedding Photoshoot Viral Story ,varsha Bol-TeluguStop.com

తాము ఎవరినైనా లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటున్నామని తెలిపితే చాలు వెంటనే తమ అభిమానులు బాధపడుతూ ఉంటారు.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ ని అలాగే బాధపెట్టారు.

అయితే తాజాగా వర్ష బొల్లమ్మ కూడా తన ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

తమిళ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి వర్ష బొల్లమ్మ.తెలుగు సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో తన అందంతో యువత మనసులను దోచుకుంది.

అంతేకాకుండా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో బాగా సందడి చేస్తుంది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది వర్ష.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

2015 లో తమిళంలో విడుదలైన సతురన్ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత ఏడాది వరుస సినిమాలో నటించింది.ఇక 2018 లో కళ్యాణం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో  అడుగుపెట్టింది.ఇక చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది వర్ష.కానీ ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేదు.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా లో నటించగా మంచి విజయం అందుకుంది.

Telugu @varshabollamma, Middle Class, Varshabollamma-Movie

పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది వర్ష.బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో కూడా గెస్ట్ గా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఖాళీ సమయం దొరికితే చాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతుంది.

Telugu @varshabollamma, Middle Class, Varshabollamma-Movie

ఇప్పటివరకు ఏ రోజు కూడా గ్లామర్ షో చేయలేదు ఈ బ్యూటీ.అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన సెల్ఫీ వీడియో షేర్ చేస్తూ.

వెడ్డింగ్ ఫోటో షూట్ ఫీల్స్.కానీ అది నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అయితే మొదట వెడ్డింగ్ ఫోటోషూట్ అనగానే తన అభిమానులు షాక్ అయ్యారు.తన పెళ్లి ఏమో అని ఒక్కసారి స్టన్ అయ్యారు.

తర్వాత మెసేజ్ చూసి ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube