అభిమాని ఫోన్ విసిరేసిన బాలీవుడ్ హీరో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్?

సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు అక్కడికి అభిమానులు చేరుకొని వారితో ఫోటోలు సెల్ఫీలు దిగడానికి ఎగబడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తొక్కిసలాటలు కూడా జరుగుతూ ఉంటాయి.

 Ranbir Kapoor Threw The Fans Mobile Video Goes Viral Ranbir Kapoor, Throw Mobile-TeluguStop.com

అటువంటి సమయంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అటువంటి సమయంలో కొందరు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు.

అయితే కొందరు సెలబ్రిటీలు ఎటువంటి హడావిడి లేకుండా డీసెంట్ గా బిహేవ్ చేస్తే సెలబ్రిటీలు కూడా ఫోటోలు, సెల్ఫీలకు సహకరిస్తుంటారు.కానీ కొంతమంది మాత్రం సెలబ్రిటీలు కనిపించగానే వారి మీదకు పడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఒక సెల్ఫీ తీసుకుంటే సరిపోదు అన్నట్టు ఇలా వెంటపడుతూ వారిని విసిగిస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అభిమానులు సెలబ్రిటీలకు చిరాకు తెప్పిస్తూ ఉంటారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.ఒక అభిమాని విసిగించడంతో బాలీవుడ్ హీరో అతని ఫోన్ ని విసిరేసాడు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో రణబీర్ కపూర్ ఒక పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళగా అక్కడ అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

ఈ క్రమంలోనే ఒక అభిమాని మొబైల్ తీసుకొని రెండుమూడు సార్లు ట్రై చేశాడు.రెండుసార్లు నవ్వుతూ రియాక్ట్ అయిన రణబీర్ ఆ అభిమాని మూడోసారి కూడా సెల్ఫీ దిగేందుకు ట్రై చేయడంతో మొబైల్ లాక్కొని వెనక్కి విసిరేశాడు.

అంతటితో వీడియో అయిపోతుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు అభిమానులు రెండుసార్లు సెల్ఫీ దిగిన తర్వాత మళ్లీ మళ్లీ విసిగిస్తే ఎవరైనా ఈ విధంగానే రియాక్ట్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం రణబీర్ కపూర్ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అభిమాని చేసిన పనికి కోపగించుకోవాలి కానీ అలా సెల్ ఫోన్ విసిరేస్తే ఎలా అని మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube