రోజులో పది నిమిషాలు మౌనంగా ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

చాలామంది ప్రజలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ప్రజల శరీరంతో పాటు మనస్సు, మెదడును ప్రభావితం చేస్తుంది.

 Do You Know How Many Benefits There Are If You Keep Silent For Ten Minutes A Day-TeluguStop.com

ఇది మన ఒత్తిడిని కూడా పెంచుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 నిమిషలు పాటు మౌనంగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మీరు ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం.ప్రతి మత సంస్కృతిలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండడానికి ప్రాముఖ్యత ఇచ్చారు.

కొంత మంది దీనికి మతపరమైన పేరు కూడా పెట్టారు.అందరూ దీన్ని జీవన విధానంగా భావిస్తారు.

ధ్యానం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చాలా మంది మనస్తత్వవేత్తలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మనశ్శాంతిని, సానుకూల ఆలోచనలను పెంచడానికి ప్రతి రోజు కనీసం 10 నిమిషములు మౌనంగా ఉండాలని సూచిస్తున్నారు.

Telugu Brain, Tips, Mind-Telugu Health

మనం కొంత సమయం మౌనంగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోచ్చు.ఇది మన మనసును ప్రశాంతంగా, మెదడును విశ్రాంతిగా ఉంచుతుంది.మౌనంగా చేసే ధ్యానం మన మెదడుకు కొత్త శక్తిని అందిస్తుంది.ఇది మన మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది.కొంత సమయం పాటు మౌనంగా ఉండడం వల్ల మన మెదుడి కణాలు పునరుత్పత్తినీ చేస్తుంది.

Telugu Brain, Tips, Mind-Telugu Health

దీని వల్ల మన మెదడు పని తీరు మెరుగుపడుతుంది.జీవితంలో ధ్యానం కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది.అందువల్ల ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు మౌనంగా ఉండడమే ఉత్తమమైన పని.మౌనంగా చేసే ధ్యానంతో శరీర మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.ప్రతిరోజు 30 నిమిషములు ధ్యానం చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ధ్యానంతో నిద్రలేమి సమస్యతో ఉపశమనం పొందవచ్చు.ధ్యానం చేయడంతో అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube